మచ్చలేని నేతలను ఇబ్బందులు పెడుతారా..
కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు..
కాంగ్రెస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షుడు నాయిని
కాజీపేట చౌరస్తాలో రాస్తారోకో
వరంగల్ వాయిస్, కాజీపేట: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి నాయకత్వంలో సోనియా గాంధీపై మోడీ ప్రభుత్వం ఈడీ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, దానికి నిరసనగా శుక్రవారం కాజీపేట చౌరస్తాలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం మచ్చలేని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ దర్యాప్తు పేరుతో ఎంక్వయిరీ చేయాలని పిలిపించి వారిని ఇబ్బందులు పెడుతోందన్నారు. కాంగ్రెస్ గాంధీ కుటుంబంపై మచ్చ వేసే విధంగా ప్రయత్నాలు చేస్తోందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పేదలపై నిత్యావసర సరుకుకలు, గ్యాస్, పెట్రోల్ , డీజిల్ ధరలు పెంచి బీజేపీ మోడీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని, ఎనిమిది సంవత్సరాల మోడీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాజీపేట క్రూ లింకులను విజయవాడకు తరలించారని ప్రమోషన్ల పేరుతో అక్రమ బదిలీలు చేశారని, కాజీపేట రైల్వే జంక్షన్ డివిజన్ కేంద్రం చేయాలనే డిమాండ్ ఉండడం వల్లనే ఈ విధమైన చర్యలకు కేంద్రం ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ నాయకులు ఉద్యమాల పేరుతో ప్రగల్బాలు పలికారన్నారు. స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి, ఎంపీల దగ్గరికి బీజేపీ అధ్యక్షుడిని తీసుకెళ్లి రైల్వే జీఎంను కలిసి, కాజీపేట ప్రజలను రైల్వే కార్మికులను తప్పుదోవ పట్టించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. 25న సోనియా గాంధీ గారిని ఈడీ పేరుతో మరొకసారి పిలవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ పిలుపుమేరకు మండల హెడ్ క్వార్టర్స్ లలో నిరసన కార్యక్రమాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను శ్రేణులను కోరుతున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పరకాల నియోజకవర్గం కోఆర్డినేటర్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు కార్పొరేటర్లు తోట వెంకన్న, పోతుల శ్రీమాన్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ అంకుష్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మహిళ నాయకులు గుంటి స్వప్న, రవళి మేరీ, సమతా , లలిత, విజయ, సులోచన, రజియా, పెరుమాళ్ళ రామకృష్ణ, సతీష్, రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
