Warangalvoice

Admissions from now.. Fees round

ఇప్పటినుంచే అడ్మిషన్లు..ఫీజుల గోల

  • కార్పోరేట్‌ స్కూళ్ల దోపిడీకి రంగం సిద్దం
  • ముందే వసూళ్లకు ముందస్తు పరీక్షలు

వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: త్వరలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. పిల్లలు పరీక్షల కోసం కుస్తీ పడుతున్నారు. పరీక్షల కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వచ్చే ఏడాదికి సంబంధించి అడ్మిషన్ల గోల మొదలయ్యింది. ప్రైవేట్‌ స్కూళ్లు యదావిధిగా వసూళ్లకు తెగబడు తున్నాయి. తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేసే పనిలో పడ్డాయి. ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించి మార్చిలో కొత్త అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభించేందుకు పలు పాఠశాలలు రంగం సిద్దం చేశాయి. ఈ క్రమంలో వీరి దృష్టి అంతా వసూళ్లపై నే ఉంది. విద్యార్థులు, టీచర్లపై వారికి దృష్టి ఉండడం లేదు. టీచర్లకు సకాలంలో జీతాలు ఇవ్వాలన్న లక్ష్యం పక్కకు పోయింది. ఫీజలును పెంచేసి డబ్బులు లాగేయాలన్న లక్ష్యంతో కార్పోరేట్‌ స్కూళ్లు తల్లిదండ్రులను వేధించక తప్పడం లేదు. ప్రైవేట్‌ విద్యాసంస్థలు కూడా తమ డబ్బు కోసం విద్యా వ్యాపారాన్ని నిర్లజ్జగా కొనసాగిస్తున్నారు. తమ ఫీజులను రాబట్టుకనే క్రమంలో వారు ఎంత కఠినానికైనా దిగజారు తున్నారు. అంతా విూ పిల్లల కోసమే అని చెప్పి పరోక్షంగా ప్రకటిస్తారు. తెలంగాణలో గతంతో పోలిస్తే విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. పాఠశాల స్థాయి నుంచి నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి భవిష్యత్తులో సామాజిక మార్పునకు దోహద పడుతుందని రుజువు చేయాలి. అలాగే ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు చదువును కొనే దుస్థితి నుంచి బయటపడేలా చేయాలి. సామాన్యులకు చదవును దగ్గర చేసేందుకు ఎంతయినా ఖర్చు చేయాలి. అప్పుడే విద్యారగం పటిష్టం కాగలదు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గగలదు. లేకుంటే విద్య కోసం పేదలు సైతం లక్షల్లో ఖర్చు చేసేందుకు అప్పుల బారిన పడుతున్నారు. కార్పోరేట్‌ స్కూళ్‌ ఫీజు దోపిడీలను అరికట్టాలి. నిర్ణీత ఫీజులు ఉండేలా చూడాలి. అందుకు తెలుగు రాష్టాల్ల్రో సాగుతున్న కృషి మరింత ముందుకు సాగాలి. గురుకులాల ఏర్పాటు వల్ల సామాన్యులకు నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులోకి వచ్చింది. అయితే తెలంగాణలో కెజి టూ పిజి విద్యకు ప్రణాళిక ప్రకటించినా ఎందుకనో అది పట్టాలకెక్క లేదు. నిజానికి కులమతాలకు అతీతంగా విద్యను అందిస్తానని సిఎం కెసిఆర్‌ పలుమార్లు ప్రకటించారు. సామాన్యుడి నుంచి, రాజకీయ నాయకుల, అధికారుల పిల్లలంతా ఒకే విద్యావిధానంలో చదవాలన్న ఆకాంక్షను ప్రకటించారు. కులరహిత హాస్టళ్లు ఉండకూడదని కూడా చెప్పారు. ఇంతటి ఉదాత్తమైన పథకం ఎందుకనో ముందుకు సాగడం లేదు. నిజానికి ఇప్పటి వరకు సిఎం కెసిఆర్‌ చేస్తున్న పథకాలు ఒక ఎత్తయితే ఈ పథకం ఒక ఎత్తయ్యేది. తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేది. కామన్‌ ఎడ్యుకేషన్‌ అన్నది సమాజాంలో అంతరాలను తొలగి స్తుంది. అది ఎల్‌కెజి నుంచే పిల్లల్లో భేదభావాలు లేకుండా చేస్తుంది. ఇప్పుడున్న స్కూళ్లను చూస్తుంటే ఆర్థికస్థాయిని బట్టి నడుపుతున్నారు. అయితే ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉండగానే గురుకులాలు, ఉర్దూవిూడియం స్కూళ్లు ప్రారంభించడం, అనేక హాస్టళ్లను కొత్తగా చేప్టటడం వల్ల పథకం అటకెక్కిందన్న భావన కలుగుతోంది. ప్రస్తుతానికి ఈ ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలే ఇస్తున్నాయి. విద్యారంగానికి ప్రభుత్వం కూడా అధిక బడ్జెట్‌ కేటాయింపులు చేసి వివిధ రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గురుకుల విద్యాలయాల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కొక్క విద్యార్థిపై ఏటా ఒక లక్ష రూపాయలు వెచ్చిస్తున్నారు. పేదపిల్లలకు కార్పోరేట్‌ విద్యాసంస్థలను తలదన్నే విధంగా చదువు, సౌలభ్యాలు, మౌలిక వసతులు లభిస్తున్నాయి. దాని వల్లనే తొలి సారిగా కార్పోరేట్‌ విద్యాసంస్థల పాతర్యాంకుల చరిత్రను తలకిందులు చేస్తూ ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలు అగ్రస్థానం సాధిస్తున్నాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యాలయాల ద్వారా చేస్తున్న నిశ్శబ్ద విప్లవం. చదువుకుంటే నిరుద్యోగిగా మిగిలిపోతున్న ప్రస్తుత తరుణంలో ఉపాధికి తగ్గ చదువు దక్కేలా చేయాలి.

Admissions from now.. Fees round
Admissions from now.. Fees round

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *