Warangalvoice

We will bravely face the ED investigation

ఇడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాం

  • బిఆర్‌ఎస్‌ను కూల్చే కుట్రలు ఫెయిల్‌తో నోటీసులు
  • తెలంగాణ బిడ్డలం వెరిచేది లేదన్న ఎమ్మెల్సీ కవిత
  • మోడీ పాలనా వైఫల్యాలపై ఘాటు విమర్శలు

వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తాను.. తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ బిడ్డనని, ఎలాంటి బెదిరింపులకు లొంగబోమని అన్నారు. ఢల్లీిలో ఎమ్మెల్సీ కవిత విూడియాతో మాట్లాడారు. తాను విచారణకు సహకరిస్తాన్న కవిత ..ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్‌ సంతోష్‌ సిట్‌ ముందుకు ఎందుకు రావడం లేదని ఎదురు ప్రశ్నించారు. సిట్‌ ముందుకు వచ్చేందుకు బీఎల్‌ సంతోష్‌కు భయమెందుకు..? అని కవిత ప్రశ్నించారు. బీజేపీ నేతలు, బీజేపీలో చేరిన నేతలపై ఈడీ, సీబీఐ కేసులు ఉండవు. బీజేపీని ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు, కేసులు పెడుతారు. తమ వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉంది. ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం అని కవిత తేల్చిచెప్పారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ అధికారులే తమ ఇంటికి రావచ్చని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఒక వేళ ఈడీ ఇంటికి రానంటే తానే ఈడీ అధికారులు ఎదుట హాజరవుతానని చెప్పారు. ఇలాంటి కేసుల్లో మహిళలను ఇంట్లోనే విచారిస్తారని గుర్తు చేశారు. కుదరక పోతే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అయినా విచారిస్తారని తెలిపారు. కానీ కావాలనే తనను ఢిల్లీకి పిలిచారని,2023, మార్చి11వ తేదీన ఉదయం 11న ఈడీ విచారణకు హాజరవుతానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టేందుకే ఈడీని ప్రయోగిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఏడాది చివరి వరకు తెలంగాణలో ఎన్నికలున్నాయని..అందుకే ప్రధాని మోడీ తమను టార్గెట్‌ చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు ఉన్నా మోడీ వచ్చే ముందు ఈడీ రావడం కామన్‌ అని చెప్పారు. అందుకే తమను భయపెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం ఈడీని తమపై ప్రయోగించిందన్నారు. తనను మాత్రమే కాదు..తనతో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నేతలు సహా 15 మందిని బీజేపీ ప్రభుత్వం విచారణ పేరుతో వేధిస్తోందన్నారు. దేశంలో డబుల్‌ ఇంజన్‌ సర్కారు నడుస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇందులో ఓ ఇంజన్‌ ప్రధాని మోడీ అయితే… మరో ఇంజన్‌ అదానీ అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలను టార్గెట్‌ చేయడంలో శ్రద్ధ చూపెడుతున్న మోడీ..దేశంలో సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. గాంధీజీ పుట్టిన దేశంలో ప్రస్తుతం అబద్దాలు రాజ్యమేలుతున్నాయని చెప్పారు. మోడీ ఎంత భయపెట్టినా..భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా..పోరాటం చేస్తామని..న్యాయ వ్యవస్థపై నమ్మకముందున్నారు. మోదీ వన్‌ నేషన్‌.. వన్‌ ఫ్రెండ్‌ స్కీమ్‌ అమలు చేస్తున్నారు అని కవిత మండిపడ్డారు. బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్‌ అవుతుంది. మహిళా బిల్లు ఆందోళన అనగానే తనకు ఈడీ నోటీసులు ఇచ్చారు. వంట గ్యాస్‌ ధరలపై మరొకరు గళమెత్తితే వాళ్లకు కూడా ఈడీ నోటీసులు ఇస్తారు. కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలను పంపుతున్నారు అని కవిత ధ్వజమె త్తారు. నవంబర్‌, డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు రావొచ్చు అని కవిత పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానం. తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేయడమే బీజేపీ లక్ష్యం. తమ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేంద్రం లక్ష్యంగా చేసుకుంది. దర్యాప్తు సంస్థలతో తమపై దాడులు చేయిస్తోంది. ఈడీ, సీబీఐ, ఐటీ బెదిరింపులకు పాల్పడుతోంది అని కవిత తెలిపారు. ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ నేతలను వేధించడం కేంద్ర దర్యాప్తు సంస్థలకు అలవాటుగా మారిందని కవిత విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని, అది సాధ్యం కాకపోవడంతో తనను టార్గెట్‌ చేశారని కవిత చెప్పుకొచ్చారు. ఈ కుట్రలను రాజకీయంగా తిప్పికొడతామన్న కవిత మద్యం కుంభకోణం దర్యాప్తుపై అంత తొందర ఎందుకని ఆమె ప్రశ్నించారు. మహిళలను ఇంటిలో విచారించాలని, కావాలంటే నిందితులను ఇంటికి తీసుకురావాలని ఈడీని కోరానని ఆమె విూడియాకు వెల్లడిరచారు. రెండు రోజుల సమయమైనా తనకు ఇవ్వరా అని ఆమె నిలదీశారు

We will bravely face the ED investigation
We will bravely face the ED investigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *