- పిడికిలి బిగించి అభివాదం చేసిన కవిత
- విచారణ కొనసాగిస్తున్న ఇడి అధికారులు
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు. పిడికిలి బిగించి మనదే విజయం అనే సంకేతం ఇస్తూ కవిత కార్యాలయం లోకి వెళ్లారు. కాగా, కవితకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ నేతలు తుగ్లక్‌రోడ్డులోని నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో కవిత భేటీ అయ్యారు. గతరాత్రినుంచే వీరు అనేక అంశాలపైనా చర్చించారు. ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో కసరత్తు చేశారని సమాచారం. ఇదిలావుంటే ఈడీ ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో.. ఆ ఆఫీస్‌లో కూర్చున్న తర్వాత కవిత ముఖంలో కనిపించిన ఆందోళన, భయానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ విూడియాలో వైరల్‌గా మారాయి. బయటకు పిడికిలి బిగించి బీఆర్‌ఎస్ శ్రేణులకు అభివాదం చేస్తూ ధీమాగా కనిపిస్తున్నా.. అరెస్ట్ తప్పదనే నైరాశ్యం కవిత ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆమె కళ్లలో ఆ భయం కొట్టొచ్చినట్లు కనిపించిందని చెప్పడానికి తాజాగా వైరల్ అవుతున్న కవిత కళ్లకు సంబంధించిన ఫొటోలే కారణం. ఇటీవల తెలంగాణ శాసనమండలిలో కూడా ఈ తరహా భయం, తత్తరపాటు కవితలో కనిపించాయి. శాసనమండలిలో కేటీఆర్, కవిత పక్కపక్కనే కూర్చుని సీరియస్‌గా మాట్లాడుకుంటున్న దృశ్యాలు లిక్కర్ స్కాం కేసులో కలవరపాటును బహిర్గతం చేశాయి. పైగా.. కేటీఆర్ శాసనమండలిలో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆ వెనుకే కూర్చున్న కవిత ఎంతో ముభావంగా కనిపించారు. ఆమె ముఖంలో భయం, తత్తరపాటు స్పష్టంగా కనిపించాయి.మరోవైపు ఢల్లీి లిక్కర్ స్కామ్ కు సంబంధించి రెండు గంటలుగా కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. కవితను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఢల్లీి లిక్కర్ స్కాం లో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండోస్పిరిట్స్ కంపెనీలో వాటాలు, 100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. ఇప్పటి వరకు ఢల్లీి లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు సాక్ష్యాలతో కవితను ప్రశ్నిస్తోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేస్తున్నారు. అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ , సవిూర్ మహేంద్రు, అమిత్ అరోరాఇచ్చిన సమాచారంతో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
