Warangalvoice

chirangeevulu_ias_officer

ఆర్థికంగా బలపడాలంటే రాజ్యాధికారం రావాలి

  • రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు

వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీలు ఆర్థికంగా బలపడాలంటే రాజకీయంగా రాణించాలని అందుకు రాజ్యాధికారం అవసరమని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు పిలుపునిచ్చారు. బీసీ ఐక్యవేదిక మేధావుల సంఘం ఆధ్వర్యంలో హనుమకొండలోని మాస్టర్ జీ డిగ్రీ కళాశాలలో బీసీ ఉద్యమ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ, సమస్యల పరిష్కారం అనే అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా చిరంజీవులు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నో బీసీ సంఘాలు ఉన్నప్పటికీ వారి మధ్య సఖ్యత లేక బీసీలు రాజకీయంగా రాణించలేకపోతున్నారని, భవిష్యత్తు రాజకీయాలు రాణించాలంటే బీసీల మధ్య సఖ్యత తప్పనిసరని తెలిపారు. కుల గణాలతో బీసీలకు మరింత లాభం జరిగే అవకాశం ఉందని, సమగ్ర సర్వేపై కొన్ని పార్టీలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జాక్, మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, ఓబీసీ కో కన్వీనర్ గడ్డం భాస్కర్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాడ్నాల నరేందర్, కోశాధికారి వైద్యం రాజగోపాల్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం, చందా మల్లయ్య, వేణుగోపాల్, డాక్టర్ కూరపాటి రమేష్, చేరాల సూర్యనారాయణ, మేధావులు పాల్గొన్నారు.

chirangeevulu_ias_officer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *