- పార్లమెంటులో విపక్ష ఎంపిల ఆందోళన
- నల్ల చొక్కలాతో ఎంపిల నిరసన
- ఉభయసభలు వాయిదా
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంలో జెపిసి వేయాలని, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు విధించి నందుకు నిరసనగా సోమవారం కాంగ్రెస్ ఎంపీలు నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు విధించడాన్ని నిరసిస్తూ.. విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్లమెంట్ ఉభయసభల్లోనూ విపక్ష ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శించారు. లోక్‌సభలో కొందరు ఎంపీలు స్పీకర్ ఓం బిర్లా చైర్‌ను ముట్టడిరచారు. స్పీకర్ చైర్‌పై పేపర్లు చించి విసిరేశారు. ప్లకార్డులను కూడా విసిరేశారు. అయితే ఆందోళనల మధ్యలోనే స్పీకర్ బిర్లా సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభను 2 గంటల వరకు వాయిదా వేశారు. తరవాత పార్లమెంట్ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద విపక్ష నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అదానీ అంశంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు అంశాన్ని కూడా ప్రస్తావించారు. రాహుల్ ఇష్యూకు నిరసనగా కూడా ప్రదర్శన చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అంటూ ప్రతిపక్షాలకు చెందిన నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీకి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు పెద్దఎత్తున నిరసనల నేపథ్యంలో లోక్‌సభ వాయిదా పడిరది. మరోవైపు ఉదయం ఖర్గే ఆఫీసులో కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఆ భేటీకి సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. రాహుల్ అనర్హత వేటు అంశాన్ని వాళ్లు ప్రధానంగా చర్చించారు. నల్ల దుస్తుల్లో ఎంపీలు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. విపక్ష ఎంపీల భేటీకి నల్ల దుస్తుల్లో తృణమూల్ ఎంపీలు కూడా హాజరయ్యారు. పార్లమెంట్‌లోని కాంగ్రెస్ చీఫ్ మలికార్జున్ ఖర్గే కార్యాలయంలో భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాల సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు కూడా పాల్గొన్నారు.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ముందుకు వచ్చిన వారికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ధన్యవాదాలు తెలిపారు.కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ సోమవారం పార్లమెంటులో బూడిద రంగు చీరలో కనిపించారు.మరోవైపు కీలక బిల్లుల ఆమోదం కోసం రాజ్యసభ ఎంపీలకు బీజేపీ సోమవారం విప్ జారీ చేసింది.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో ప్రతిపక్ష నేతల వ్యూహాత్మక సమావేశంలో కాంగ్రెస్ పార్టీతోపాటు డీఎంకే, ఎస్పీ, జేడీయూ, బీఆర్‌ఎస్, సీపీఎం, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఐ కేరళ కాంగ్రెస్, టీఎంసీ,ఆప్ పార్టీల సభ్యులు, నేతలు పాల్గొన్నారు.
