Warangalvoice

Corona cases are alarming

ఆందోళనకరంగా కరోరనా కేసులు

  • మాస్కులు తప్పనిసరి చేసిన తమిళనాడు
    వరంగల్ వాయిస్,చెన్నై: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ `19 కేసుల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం కీలక నిర్ణయం వెలువరించింది. అన్ని ఆసుపత్రుల్లోనూ ఏప్రిల్‌ 1 నుండి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ఆసుపత్రులలో ఇన్‌ఫెక్షన్‌, క్రాస్‌`ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందన్న నిపుణుల హెచ్చరికతో.. అన్ని ఆసుపత్రులలోని ఇన్‌పేషెంట్‌, ఔట్‌ పేషెంట్‌ వార్డులలో వైద్యులు, మెడికోలు, ఇంటర్న్‌లు, నర్సులు, సాంకేతిక నిపుణులు, పరిపాలనా సిబ్బంది, రోగులు, అటెండర్లు అన్ని వేళలా మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లోనూ మాస్కులు తప్పనిసరి ధరించేలా డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ టీఎస్‌ సెల్వ వినాయగం జిల్లా ఆరోగ్య అధికారులను ఆదేశారు. నిబంధనలు పాటించాలని, లేదంటే జరిమానా కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా నమోదైన 139కేసులతో కలిపి క్రియాశీల కొవిడ్‌ కేసుల సంఖ్య 777కి చేరుకుంది.
Corona cases are alarming
Corona cases are alarming

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *