
- పేరుకే పట్టణ ప్రగతి….
- పైసాలన్ని అధోగతి
- బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ
వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నగరం నడిబొడ్డున ఉన్న యాదవ్ నగర్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ విమర్శించారు. బుధవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా రావు పద్మ 4వ డివిజన్ అధ్యక్షుడు గొర్రె ఓం ప్రకాష్ అధ్వర్యంలో డివిజన్ పరిధిలోని యాదవ నగర్, గొల్లపల్లిలో ఇంటింటికీ తిరుగుతు కేంద్ర ప్రభుత్వం వరంగల్ మహానగరంలో చేసిన అభివృద్ధి పథకాలకు కేటాయించిన నిధులపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం గౌడ్, జిల్లా యువమోర్చ అధ్యక్షుడు తీగల భరత్ గౌడ్, ఓబీసీ మోర్చ అధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్, ట్రేడర్స్ సెల్ జిల్లా కన్వీనర్ పిట్ట భరత్, 5వ డివిజన్ అధ్యక్షుడు అనిశెట్టి రంజిత్, 54వ డివిజన్ అధ్యక్షుడు కురిమిండ్ల సదానందం, బీజేపీ నాయకులు మంధాటి వినోద్, కల్లూరి పవన్, శ్యామ్, రాజు, అశోక్, శివ, విజయ్, అరుణ్, నితిన్, అఖిల్, రేవంత్, సాయి, ధీరజ్, తదితరులు పాల్గొన్నారు.