- బ్యాంకుల్లోని డబ్బులు దోచేస్తారు..
- వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి
- విష్ణుప్రియ గార్డెన్స్ లో విద్యార్థులకు అవగాహన సదస్సు
వరంగల్ వాయిస్, క్రైం: వివిధ సామాజిక మాద్యమాల్లో పరిచయమయ్యే అపరిచత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారన్ని పంచుకోవద్దని యువతకు వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి దిశా నిర్దేశం చేశారు. హనుమకొండ డివిజినల్ పోలీసుల అధ్వర్యంలో సైబర్ క్రైమ్స్, రోడ్డు సేఫ్టీ , మత్తు పదార్థాలపై కళాశాల విధ్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక హంటర్ రోడ్ లోని విష్ణు ప్రియ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం రోజు, రోజుకి అధికం కావడంతో పాటు, అదే స్థాయిలో ఇంటర్ నెట్ ను వినియోగించుకోని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ, ప్రజల డబ్బును దోచేస్తున్నారన్నారు. ఇందుకు ముఖ్య కారణం నెట్ వినియోగ సమయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా వుండాలని, ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సంక్షిప్త మెసేజ్ లకు స్పందించవద్దని, అదే సమయంలో బ్లూ కలర్ లింక్ పై క్లిక్ చేయవద్దన్నారు. ఒక వేళ ఇలా చేయడం ద్వారా మీ వ్యక్తిగత సమాచారంతో పాటు, మీ బ్యాంక్ లోని డబ్బులు సైబర్ నేరగాళ్లు దోచేస్తారని, నెట్ బ్రౌజింగ్ సమయంలో మనకు వచ్చే నోటిఫికేషన్లపై వెంటనే స్పందించవద్దని, అదే విధంగా కోట్ల రూపాయలు, కారు గెలుచుకున్నారని వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దన్నారు. తమ వ్యక్తిగత బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి వచ్చే ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దని, ఒక వేళ సైబర్ నేరగాళ్ల చేతులో మోసపోయినట్లుయితే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం అందించాలి. తద్వారా మీరు మోసపోయిన డబ్బులు వంద శాతం తిరిగివస్తాయని తెలియజేయడంతో పాటు రోడ్డు సేఫ్టీపై పోలీస్ కమిషనర్ ప్రస్తావించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారానే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలయి, తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలకు దూరంగా వుండాలని, ఏవరైన మత్తు పదార్థాలు అమ్మకాలు, వినియోగం చేసిన తమకు సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా వుంచుటామని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
అంతకు ముందు ప్రముఖ సినీ నటుడు శివారెడ్డి, జబర్దస్త్ ఫేం వెంకీ మిమిక్రీ ప్రదర్శనతో పాటు, స్థానిక కళాకారులచే పేరిణీ నృత్యం, నృత్య ప్రదర్శనలు విధ్యార్థులను అకట్టుకున్నాయి. కార్యక్రమములో సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్, హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, ఇన్ స్పెక్టర్లు రాఘవేందర్, దయాకర్, శ్రీనివాజ్, వరంగల్ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం అధ్యక్షుడు అమరేందర్,కార్యదర్శి సురేందర్ రెడ్డితో పాటు హనుమకొండ డివిజినల్ ఎస్.ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
