పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
వరంగల్ వాయిస్, హనుమకొండ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ గా చర్లపల్లి జైలుకే పంపిస్తామని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న సమావేశం దేశ, రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారనుందన్నారు. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పురించబోతున్నామని ఆయన ప్రకటించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నట్టేటా ముంచుతున్నారన్నారని మండిపడ్డారు. ప్రజలకోసం, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్యం కోసం రాజాకీయాలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, పీసీసీసభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, టీపీసీసీ మాజీ కార్యదర్శి ఈవీ శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్ నసీం జాహన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఎన్ ఎస్ యూఐ అధ్యక్షుడు పల్లకొండ సతీష్, జిల్లా ఏఐయూఈడబ్ల్యూసీ అధ్యక్షురాలు గుంటి స్వప్న, ఎస్.టి. సెల్ జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకుష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్, అంబేద్కర్ రాజు, మహమ్మద్ సమద్ బొంత సారంగం, నాగపురి లలిత, కె. ప్రభావతి, డివిజన్ అధ్యక్షుడు నాగపురి దయాకర్, మహమ్మద్ జాఫర్, బి.శ్రీధర్ యాదవ్, శివాజీ, సైండ్ల శ్రీకాంత్, ఎస్.కుమార్ యాదవ్, ఓరుగంటి పూర్ణ, జి.సంగీత్, వల్లపు రమేష్, షేక్ అజ్గర్, కొండా నాగరాజు, దోపతి రవి, కొండుక ప్రదీప్ కుమార్, తాళ్ళపల్లి సుధాకర్, రవి కిరణ్, నాయకులు మంద రాకేశ్, తడక సుమన్, తదితరులు పాల్గొన్నారు.