వరంగల్ వాయిస్, హనుమకొండ : హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం విశ్వబ్రాహ్మణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్డికాలనీలోని అతిథి దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు అన్నదానం కోసం అసోసియేషన్ బాధ్యుడు పెద్దోజు వెంకటచారి ఆర్థికసాయం అందజేశారు.
అనంతరం ఎంజీఎం ఆస్పత్రిలో 35వ సారి రక్తదానం చేశాడు. ఈ కార్యక్రమంలో షణ్ముఖ చారి, వేణు, రాము, సర్వేశ్వర్, రాజు, రవీందర్, సిద్దోజు రాకేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
