- మద్దతుగా టీఏజేఎఫ్, టీడబ్లూజేఎఫ్ నేతలు
- నాగరాజు గెలుపు ఖాయం: ఐజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ
వరంగల్ వాయిస్, హనుమకొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రధాన యూనియన్ అయినా టీయూడబ్ల్యూజే ఐజేయూ నుంచి వేముల నాగరాజు అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం సాయంత్రం 4.50గంటలకు ఐజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీతోపాటు జాతీయ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, వివిధ యూనియన్ల ప్రతినిధుల ఆధ్వర్యంలో తన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి సామంతుల శ్రీనివాస్ కు అందజేశారు. వేముల నాగరాజు గెలుపు కోసం తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్, తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ నాయకులతో పాటు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ సభ్యులు తరలివచ్చి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ హాలీ మాట్లాడుతూ రాష్ట్రంలో టీయూడబ్ల్యూజే 143 ఎక్కడ గెలిచిన దాఖలాలు లేవన్నారు. 143 యూనియన్ నాయకులు అహంకారాన్ని ప్రదర్శిస్తూ ప్రెస్ క్లబ్ సభ్యులను తప్పుదోవ పట్టిస్తూ గెలుపే లక్ష్యంగా అనేక అక్రమాలకు పాల్పడుతూ జర్నలిస్టుల ఐక్యతను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో రెండు సంఘాలు మద్దతు పలికి ఐజేయూ ప్యానెల్ ను గెలిపించేందుకు శాయ శక్తుల కృషి చేస్తున్నాయన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే యూనియన్ ఉన్న సమయంలో జర్నలిస్టులు ఐక్యతతో పని చేశారని, తెలంగాణ ఏర్పాటు అనంతరం 143 యూనియన్ ఏర్పడి జర్నలిస్టులకు అన్యాయం చేసిందన్నారు. తెలంగాణలో ఎక్కడలేని విధంగా వరంగల్ ప్రెస్ క్లబ్ లో అక్రమాలు, నియంత పోకడలు జరుగుతున్నాయని చెప్పారు. మద్దతు పలికిన తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు మాట్లాడారు. టీఏజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ నూటెంకి మాట్లాడుతూ ఐజేయూ నాయకుల గెలుపు కోసం తాము పాటుపడుతున్నామని, అందువలన వారికి రాష్ట్ర నాయకత్వం తరఫున మద్దతు ప్రకటించామని చెప్పారు. అలాగే గత వైభవాన్ని ప్రెస్ క్లబ్ లో చూసేందుకు ప్యానెల్ ను గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రభాకర్ సూచించారు. అనంతరం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు మాట్లాడుతూ ఐజేయూ గెలుపు కోసం తమ యూనియన్ పాటు పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కౌన్సిల్ ఫార్మర్ నెంబర్, తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి వేముల సదానందం నేత, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, రాష్ట్ర కార్యదర్శి గాడిపెళ్లి మధు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, నాయకులు కంకణాల సంతోష్, సిరికొండ భాస్కరరావు, వల్లాల వెంకటరమణ, నాయకులు నంబూద్రి, వేణుమాధవ్, తిరుపతి రెడ్డి, రజిని కుమార్, రావుల విశ్వప్రసాద్, సదాశివుడు, జన్ను స్వామి, సాయి ప్రదీప్, వలిశెట్టి సుధాకర్ , వరంగల్ ఐజేయు జిల్లా అధ్యక్షుడు రామ్ చందర్, నయన్ పాషా, దుర్గాప్రసాద్, సుధాకర్, కూచన సంతోష్, సాయిరాం తదితులు పాల్గొన్నారు.