వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : ఇటీవల అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగానికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, తడిసిన వడ్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ జడ్పీటీసీ లింగాల జగదీష్ చంద్ర రెడ్డి తెలిపారు. గురువారం రఘునాథ్ పల్లి మండలం కన్నయ్య పల్లి గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడవడంతో కాంగ్రెస్ బృందం అక్కడికి వెళ్లి పరిశీలించింది. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, రైతులు ఆధైర్య పడవద్దని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్, జిల్లా నాయకులు నామాల బుచ్చయ్య గౌడ్, రమేష్ రెడ్డి, గాదే రమేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
