Warangalvoice

Luxury buses available

అందుబాటులోకి లగ్జర్టీ బస్సులు

  • లాంఛనంగా ప్రారంభించిన పువ్వాడ
    వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రైవేటు బస్సులకు దీటుగా ఆధునిక హంగులతో కూడిన 16 ఏసీ స్లీపర్‌ కోచ్‌ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులకు ’లహరి` అమ్మఒడి అనుభూతి’గా ఆర్టీసీ నామకరణం చేసింది. సోమవారం ఈ కొత్త బస్సులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తదితరుల సమక్షంలో ఈ బస్సులను టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్బళ్లిÑ ఆంధప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతిÑ తమిళనాడులోని చెన్నై తదితర ప్రధాన మార్గాల్లో నూతన ఏసీ స్లీపర్‌ బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడపనుంది. 12 విూటర్ల పొడవు గల ఏసీ స్లీపర్‌ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్‌ 15తో మొత్తం 30 బెర్తులు ఉంటాయి. ఈ బస్సుల్లో ఉచిత వై`ఫై సదుపాయం అందుబాటులో ఉంది. మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యంతో పాటు ప్రతి బెర్త్‌ వద్ద రీడిరగ్‌ ల్యాంప్‌ ఉంటుంది. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలతో పాటు రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా సైతం అందుబాటులో ఉంది. బస్సుల్లో అత్యాధునికమైన ఫైర్‌ డిటెక్షన్‌ అండ్‌ అలారం సిస్టం ఏర్పాటు చేశారు. బస్సులో మంటలు చెలరేగితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ఇక ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ కూడా ఉంది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు గాను ఆర్టీసీ ఇటీవలే 630 కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను, నాన్‌ ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ 8 బస్సులను, నాన్‌ ఏసీ స్లీపర్‌ 4 బస్సులను ప్రవేశపెట్టింది. నూతనంగా ప్రారంభించిన ఈ బస్సులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు. ఈ లహరి బస్సుల్లో టికెట్‌ ధరలు ఇలా ఉన్నాయి.. మియాపూర్‌`బెంగళూరు` రూ.1630, ఎంజీబీఎస్‌`బెంగళూరు` రూ.1580 మియాపూర్‌`హుబ్బళ్లి` రూ.1510, ఎంజీబీఎస్‌`హుబ్బళ్లి` రూ.1460,బీహెచ్‌ఈఎల్‌`విశాఖపట్నం` రూ.1920, ఎంజీబీఎస్‌`విశాఖపట్నం` రూ.1860, బీహెచ్‌ఈఎల్‌`తిరుపతి` రూ.1750, ఎంజీబీఎస్‌`తిరుపతి` రూ.1690, బీహెచ్‌ఈఎల్‌`చెన్నై` రూ.1910, ఎంజీబీఎస్‌`చెన్నై` రూ.1860గా నియమించారు. ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధునాతనంగా ఆలోచిస్తోందని బాజిరెడ్డి అన్నారు.

    Luxury buses available
    Luxury buses available

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *