- బీజేపీ జాతీయ తీర్మానాలు,
- మోడీ సభపై ఆసక్తి
- నిశితంగా పరిశీలిస్తున్నప్రత్యర్థి పార్టీలు
- ప్రధాన సమావేశాల హాల్‌కు కాకతీయ ప్రాంగణంగా పేరు
- బస ప్రాంతానికి సమ్మక్క, సారలక్క నిలయం
- సెంటిమెంట్‌గా మారుతున్న తెలంగాణ
భారతీయ జనతాపార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాలను దేశంలోని అన్ని పార్టీలతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ నిశితంగా పరిశీలిస్తోంది. తెలంగాణలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నందున ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీకి చెందిన అతిరథ మహారథులందరూ పాల్గొననున్న ఈ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి కనబడుతోంది. దీనికితోడు మోడీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఎలాంటి కీలక అంశాలను ప్రస్తావిస్తారన్న అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా మోడీ సభ సక్సెస్ కావడంతోపాటు అన్ని విఘ్నాలు తొలగి పోవాలని కోరుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గ సీనియర్ నాయకుడు గంటా రవికుమార్ రాజ్యలక్ష్మి హోమం నిర్వహించగా బీజేపీ వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో కాశిబుగ్గలోని శివాలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
-వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా…
తెలంగాణ చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా ప్రముఖుల పేర్లను బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే ప్రాంగణాలకు పెట్టారు. జాతీయ కార్యవర్గ సమావేశాల మందిరానికి కాకతీయ ప్రాంగణంగా నామకరణం చేశారు. అదే విధంగా అతిథులు బస చేసే ప్రాంగణానికి సమ్మక్క, సారలమ్మ నిలయంగా, బీజేపీ ఫుల్ టైమర్ వర్కర్స్ సమావేశానికి కొమురం భీంగా, హెచ్‌ఐసీసీ నోవాటెల్‌కు శాతావాహన నగర్‌గా, మోడీ బహిరంగ సభకు విజయ సంకల్ప సభగా, ఫొటో ఎగ్జిబిషన్ ప్రాంగణానికి గోల్కొండగా, మీడియా పాయింట్‌కు షోయబుల్లా ఖాన్‌గా, జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి శక్త రామదాసుగా, భోజనశాలకు భాగ్యరెడ్డి వర్మగా, కార్యవర్గ సమావేశాల తీర్మానాల ప్రాంగణానికి నారాయణ పవార్‌గా, ప్రధాన కార్యదర్శుల మీటింగ్ హాల్‌కు వందేమాతరం రామచంద్రరావు పేరు పెట్టారు.
సెంటిమెంట్‌గా మారుతున్న తెలంగాణ..
అన్ని ప్రధాన పార్టీలకు తెలంగాణ సెంటిమెంట్‌గా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించి వరంగల్ డిక్లరేషన్‌ను ప్రకటించింది. దీనినే దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. అదే బాటలో నేడు బీజేపీ కూడా తెలంగాణనే ఎన్నుకుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించేందుకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎన్నకున్నారు. ఇక్కడినుంచే రానున్న ఎన్నికల్లో సమర శంఖం పూరించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది.
మొదటినుంచి వ్యతిరేకిస్తున్న టీఆర్‌ఎస్..
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించడంపై టీఆర్ ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది. నియోజకవర్గాల్లో పర్యటించే బీజేపీ నేతలను నిలదీయాలంటూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపు నిచ్చారు. తెలంగాణకు చేసిందేంటో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో తిరుగుతారంటూ ప్రశ్నించారు. సమావేశంలో తెలంగాణ అభివృద్ధిపై చర్చించుకోండి..ఇక్కడ జరిగిన అభివృద్ధిని దేశమంతా అమలు చేయండి..హైదరాబాద్ బిర్యానీ తినండి..మీ దారిన మీరు పోండి..అంటూ కేటీఆర్ చేస్తున్న ప్రసంగాలు కాక రేపుతున్నాయి.
ఘనంగా రాజ్యలక్ష్మి హోమం..
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 3న ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించనున్న విజయ సంకల్ప సభ విజయవంతం కావాలని కోరుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకుడు గంట రవి కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఎల్లమ్మ బజార్‌లోని రామానుజకుటంలో రాజ్యలక్ష్మి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యలక్మి అమ్మవారి ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్, పిట్టల కిరణ్, రాష్ట ఎస్సీ మోర్చా నాయకులు మాదాసు రాజు, మార్టిన్ లూధర్, జిల్లా సోషల్ మీడియా-ఐటీ కన్వీనర్ ఆడెపు వెంకటేశ్, సీనియర్ నాయకులు పొట్టి శ్రీనివాస్, పుప్పల రాజేందర్, ముట్టినెని శ్రీనివాస్, అంకాల జనార్ధన్, చిలువెరు రాజేందర్, రజక సెల్ కన్వీనర్ కొత్తపేల్లి రాజేష్, ఆర్‌హెచ్‌పి రాష్ట్ర అధ్యక్షుడు మండల భూపాల్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ ఇనుముల అరుణ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కూచన క్రాంతి, ఉపాధ్యక్షుడు సతీష్ పోశాల, డివిజన్ అధ్యక్షుడు మోహన చారి, ఎల్లబోయిన చంద్ర మోహన్, ఇనుముల అజయ్, అకినే సాగర్, పుప్పాల శ్రీనివాస్, మాచర్ల రవీందర్, ఉపేందర్, జిల్లా నాయకులు, తూర్పు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో..
ఓబీసీ మోర్చా వరంగల్ జిల్లా అధ్యక్షుడు కూచన క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలోని కాశిబుగ్గ కాశీ విశ్వేశ్వరాలయంలో ఉదయం 11 గంటలకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సభ సక్సెస్ కావాలంటూ మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి కుసుమ సతీష్, సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్, రత్నం సతీష్ సా, ఎరుకల రఘుణారెడ్డి, పైర్ధ ఆనంద్, మంతెన అమ్రిష్, వంగాల సత్యనారాయణ, బైరి శ్యాంసుందర్, ఓబీసీ నాయకులు కోట సతీష్, సుతారి గోపి, ముండ్రాతి వెంకటేశ్వర్లు, గోకే వెంకటేష్, జెట్టిలింగ్ శివప్రసాద్, బైరీ హరీష్, కడారి రవి, ఆరిటాల రవీందర్, ఓం ప్రకాష్ కోలారియా, గోగి కార్ క్రాంతి, పోతన వెంకటేశ్వర్లు, కోమాకుల నాగరాజు, గాదె రవీందర్, ఉపేందర్, క్యాతం రాజ్ కుమార్, శివకుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

