Warangalvoice

seetaramakalyanam_kataram

అంగ రంగ వైభవంగా రాములోరి పెళ్లి

  • పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

వరంగల్ వాయిస్, కాటారం : రాములోరి పెండ్లి వేడుకలు ఊరూరా ఘనంగా జరిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంత్రి శ్రీధర్ బాబు సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు-తలంబ్రాలు సమర్పించారు. అలాగే కాటారం మండల కేంద్రమైన గారి పెళ్లి కాటారం చింతకాని తదితర గ్రామాల్లో ఆయా దేవతామూర్తుల ఆలయాలలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది.మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని పెళ్లి వేడుకలను తిలకించారు. వేద మూర్తి వేద పండితులు మంత్రోచ్ఛారణలతో సీతారాముల కల్యాణాన్ని పూర్తి గావించారు. ఈ సందర్భంగా ఆయా దేవాలయాల వద్ద అన్నదానం నిర్వహించారు. భక్తాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన వేడుకల్లో పుస్తే, మట్టే తలంబ్రాలను మద్ది నవీన్, పులి అశోక్ దంపతులు సమర్పించగా చీరల రమేష్ దంపతులు అన్నదానం నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని దత్తాత్రేయ స్వామి దేవాలయం ప్రాంగణం ఆవరణలో ధన్వాడ గ్రామ ప్రజల అధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి, పార్లమెంటరీ ఎలక్షన్స్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దీళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాల బియ్యం సమర్పించి కల్యాణం చివరి వరకు ఉండి తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దీళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్షాలు సకాలంలో కురిసి రాష్ట్రంలోని రైతులకు అధిక దిగుబడి రావాలని త్వరలో యాగం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మాజీ ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ చీర్ల శ్రావణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునురి ప్రభాకర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, యూత్ అధ్యక్షుడు చీమల సందీప్, తుల్సేగారి మల్లయ్య, కృష్ణమోహన్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *