అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా వేడుకలు
వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ సమీపంలోని శ్రీనివాస కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీ సీతా రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుక సుమారు 1200 మంది భక్తుల మధ్య ప్రతీ సారి లాగానే వైభవంగా ప్రధాన అర్చకులు రవి ఆచార్య ఆధ్వర్యంలో జరిగింది. కళ్యాణంలో ఆలయ కమిటీ చైర్మన్ రావుల హరి చరణ్ రెడ్డి, కమిటీ సభ్యులు జై ప్రకాష్, లింగమూర్తి, సారంగపాణి, ప్రవీణ్ రావు, భూపాలరెడ్డి, శ్రీనివాస్ రావు, గణేష్, రామ్మోహన్ రావు శ్రీనివాస్ రెడ్డి , నర్సింహ రెడ్డి, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.