వరంగల్ వాయిస్, కరీమాబాద్ : నగరంలోని 40వ డివిజన్ కరీమాబాద్ సెక్టార్ పరిధిలోని సుభాష్ నగర్ (ఉర్సు) అంగన్ వాడీ కేంద్రంలో శనివారం బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ పిల్లలు..దేశానికి వెలుగు దివ్వెలు, ఒత్తిడి లేని విద్య..అంగన్ వాడీ విద్య, అంగన్ వాడీ ఒడి..అభివృద్ధిల బడి, తల్లీబిడ్డ క్షేమం..అంగన్ వాడీ ఆశయం అనే నినాదాలు ఆయా వాడల్లో మారుమ్రోగాయి. 30 నెలలు నిండిన పిల్లలను అంగన్ వాడీ కేంద్రానికి వచ్చేలా అలవాటు చేసి మంచి అలవాట్లు, ఆటపాట, సృజనాత్మకత, భాష పరిచయం, కథలు చెప్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లులు, గర్భిణులు, ఏఎల్ ఎంఎస్సీ కమిటీ సభ్యులు, అంగన్ వాడీ టీచర్లు బి.సునీత, టీ.నాగమణి, కిశోర బాలిక సుహిత, మహేశ్వరి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
